గోవాలో బట్టల్లేకుండా క్లిప్స్ తీసిన రాంప్రసాద్!
on Jan 6, 2026

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్" పేరుతో షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ ప్రసాద్, వాళ్ళ వైఫ్ సునీత, రాంప్రసాద్ మధ్య జరిగిన కామెడీ కన్వర్జేషన్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. "బాబాయ్ గా మొన్న మీ రీల్స్ చూసాను ఇంకొన్ని రీల్స్ చేయొచ్చుగా" అని రాంప్రసాద్ పంచ్ ప్రసాద్ ని అడిగాడు. "చేద్దామనుకున్నాను ఎక్కడా ఉత్తినే నీరసపడిపోతేనూ" అంటూ వాళ్ళావిడ సునీత మీద కౌంటర్లు వేసాడు పంచ్ ప్రసాద్. "అబ్బో సర్ శక్తిమాన్ 3 డి మరి" అని సునీత డైలాగ్ వేసేసరికి స్టేజి మీద ఉన్న అందరూ నవ్వేశారు. "చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్" అంటూ ప్రసాద్ మళ్ళీ సీరియస్ అయ్యాడు. "నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా" అని రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది. అంతే అందరూ నవ్వేశారు. ఇక తర్వాత సింగర్ లిప్సిక వచ్చి అదిరిపోయే సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. తర్వాత ఒక సెగ్మెంట్ చేశారు. పెద్ద పెద్ద రోలింగ్ డ్రమ్స్ మీద ఒక ఫ్లాట్ గా ఉన్న చెక్కతో చేసిన మ్యాట్ వేశారు. ఆ డ్రమ్స్ రోల్ అవుతూ ఉంటె అటు ఇటు ఆ మ్యాట్ మీద పండు "ఇటుక మీద ఇటుక" సాంగ్ ని చేసాడు. ముందు చేసిన పంచ్ ప్రసాద్ మాత్రం సరిగా చేయలేకపోయాడు.
అలాగే ఇంకో ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ కూడా పెట్టారు. ఒక ఎక్వేరియంలో వాటర్ పోసి ఒక నిమ్మకాయ వేసి ఆ తేలే నిమ్మకాయ మీద కాయిన్ ని బాలన్స్ చేయాలనీ చెప్పింది రష్మీ. సుహాసిని, ఆదర్శ్, పంచ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ వంటి వాళ్లంతా ట్రై చేశారు. తర్వాత వైరల్ వంటలక్క ధరణి - ఆదర్శ్ కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక నాటీ నరేష్ వచ్చి "మొన్న గోవా వెళ్ళావ్ కదా ఏవన్నా ఫొటోస్ తీసావా" అంటూ నాటీ నరేష్ రాంప్రసాద్ ని అడిగాడు. "బట్టల్లేకుండా క్లిప్స్ తీసా కొన్ని" అంటూ రాంప్రసాద్ చెప్పాడు. "మరి చూపించవా.. నేనెవరికీ చెప్పా" అన్నాడు నరేష్. "అసలు బట్టల్లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం తెలుసా" అంటూ రాంప్రసాద్ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ తీసి చూపించాడు అంతే నరేష్ పడీ పడీ నవ్వుకున్నాడు. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్"లో అంతా రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



